సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ఖాన్పేట గ్రామంలో భక్తుల కొంగు బంగారమై వెలసిన శ్రీ దుర్గా భవానీ ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి. నేడు అమ్మవారు శ్రీరాజరాజేశ్వరీ అలంకరణలో భక్తులకు కనువిందు చేశారు.
ఉత్సవాల్లో భాగంగా నేడు చండీ యాగం నిర్వహించారు. సుమారు ఒక వేయి ఎనిమిది మంది దంపతులు శ్రీరమా సమేత సత్యనారాయణ వ్రతం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి నామస్మరణలతో ఆలయ ప్రాంగమం మార్మోగింది.
- ఇదీ చూడండి : జలుబు, ఫ్లూ, కరోనా మధ్య తేడా ఏంటి?