Double Bedroom Houses: హైదరాబాద్ మహానగరం శివారు ఆర్‌సీ పురం మండలం కొల్లూరు గ్రామంలో రెండో దశ కింద నిర్మించిన రెండు పడక గదుల ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసేందుకు కొల్లూరులో అతిపెద్ద హౌసింగ్ ప్రాజెక్టుగా 15600 గృహాలను నిర్మించింది. ఈ భారీ ప్రాజెక్టును 1422.15కోట్ల వ్యయంతో కార్పొరేట్ స్థాయిలో అపార్ట్‌మెంట్‌లకు తీసిపోకుండా సకల హంగులతో నిర్మించారు. ఈ ప్రాజెక్టులో 115 బ్లాక్‌లలో గృహాల నిర్మాణాలు చేపట్టారు.
అవసరాన్ని బట్టి ప్రతి బ్లాక్‌కు రెండు లేదా మూడు స్టెయిర్ కేస్‌లను ఏర్పాటు చేశారు. స్టిల్ట్ పార్కింగ్తో పాటు పేవ్ బ్లాక్స్ , వాచ్ మెన్ గది ఏర్పాటు చేశారు. ప్రమాదాల నియంత్రణకు ఫైర్ ఫిట్టింగ్, 8 మంది కెపాసిటీ గల ప్రతి బ్లాక్‌కు రెండు చొప్పున 234 లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు. లిఫ్ట్, గృహాలకు నిరంతర విద్యుత్ కోసం, పవర్ బ్యాక్అప్ కోసం ప్రత్యేక జనరేటర్ ఏర్పాటు చేశారు. ఇతర ప్రత్యేక మౌలిక వసతులు, సదుపాయాలను కల్పించారు.
ఇదీ చదవండి: