నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లుకు వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు ఆందోళన చేపట్టారు. కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన బిల్లును వ్యతిరేకిస్తూ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఫీజుల పెంపు కారణంగా ప్రైవేటు వైద్య కళాశాలల్లో పేద విద్యార్థులకు చోటు దక్కదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వైద్యుల ఆందోళన దృష్టిలో ఉంచుకుని.. వెంటనే బిల్లును వెనక్కితీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీచూడండి: హైకోర్టు జడ్జిపై సీబీఐ విచారణ.. దేశంలోనే తొలిసారి!