సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ రెండో వార్డులో జిల్లా పాలనాధికారి హనుమంతరావు, మున్సిపల్ కమిషనర్ ఛైర్మన్‌తో కలిసి డీఎంఏ సత్యనారాయణ గురువారం పర్యటించారు. పట్టణ ప్రగతిలో అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ప్రతి వార్డులోని 4 కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి వార్డుకు 60 మంది చొప్పున ఇందులో పాల్గొనేలా ప్రణాళిక తయారు చేశారు.
సర్వేలో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీరు, విద్యుత్ సమస్యలను గుర్తించారు. మున్సిపాలిటీ పరిధిలోని అక్రమ లేఅవుట్లును గుర్తించాలని అధికారులకు సూచించారు. పట్టణ ప్రగతికి కేటాయించిన బడ్జెట్ నుంచి 10 శాతం నిధులను హరితహారం కోసం వినియోగిస్తామన్నారు.
ప్రతి వార్డును సుందరంగా తీర్చి దిద్దడం కేసీఆర్ ఆశయమని... దాన్ని సహకారం చేసేందుకు అందరూ సహాకరించాలన్నారు. ఇందకుగాను అయిదేళ్లకు కావాల్సిన ప్రణాళికలు తయారుచేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: సీజీఎస్టీ చీఫ్ కమిషనర్‌గా మల్లికా ఆర్య నియామకం