సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్లో మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది కేంద్రాలకు చేరుకున్నారు. స్థానిక డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రం వద్ద పోలింగ్ సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు.
నారాయణఖేడ్ ఆర్డీవో రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ పంపిణీ జరిగింది. పట్టణంలో మొత్తం 15 వార్డులకు గాను 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి... 153 పోలింగ్ సిబ్బందిని నియమించారు.
ఇదీ చూడండి: దక్షిణ భారతానికి తొలి 'సుఖోయ్ 30 ఎంకేఐ' దళం