ETV Bharat / state

పెండింగ్​ కేసుల్లో విచారణ వేగవంతం చెయ్యాలి: డీజీపీ - హైదరాబాద్​ వార్తలు

మెరుగైన పరిశోధన చేసి పెండింగ్‌లో ఉన్న కేసులను చేధించాలని... డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసులను ఆదేశించారు. జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో పెండింగ్ ఉన్న కేసులపై... వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమీక్షలో సిద్దిపేట కమిషనర్‌తో పాటు హుస్నాబాద్‌, గజ్వేల్‌ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

పెండింగ్​ కేసుల్లో విచారణ వేగవంతం చెయ్యాలి: డీజీపీ

author img

By

Published : Sep 29, 2020, 11:52 AM IST

పెండింగ్​లో ఉన్న కేసుల విషయమై జిల్లా ఎస్పీలు, పోలీస్​ కమిషనర్​లతో డీజీపీ మహేందర్​ రెడ్డి సమీక్ష జరిపారు. ప్రతి కేసు విషయంలోను కచ్చితమైన ప్రణాళికతో దర్యాప్తు చెయ్యాలని సూచించారు. జైలు శిక్ష అనుభవించిన వాళ్లు మళ్లీ నేరం చెయ్యాలంటే భయపడాలన్నారు. మైనర్లు, మహిళలు తప్పిపోయిన కేసులను సుప్రీంకోర్టు, హైకోర్టు, రివ్యూ చేయడం జరుగుతుందని.. ప్రతి కేసును అన్ని కోణాలలో పరిశోధన చెయ్యాలన్నారు. కేసుల్లో శిక్షల శాతం పెంచాలని సూచించారు.

జిల్లాలో పెండింగ్​లో ఉన్న గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, ప్రతివారం పెండింగ్ ఉన్న కేసులపై రివ్యూ చేస్తున్నామని సిద్దిపేట పోలీసు కమిషనర్ డి. జోయల్ డేవిస్ వివరించారు. కేసుల విషయమై సంబంధిత ఏసీపీలతో యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. పెండింగ్​ కేసులు త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

ఇదీ చూడండి: ఎట్లా పోవాలి.. శాశ్వత పరిష్కారానికి ఇంకెన్నేళ్లు..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.