రెవెన్యూ వ్యవస్థలో నూతన శకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాంది పలకడం హర్షణీయమని, అన్ని వర్గాల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ థ్యేయం అని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలో పలు గ్రామాల్లో రూ. 15 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
నియోజకవర్గంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. గత ఏడేళ్లలో ప్రతి గ్రామంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామం, చెత్త సేకరణ కేంద్రాలు, సీసీ రహదారులు, ఆర్వో ప్లాంట్లు లాంటి మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసినట్లు మహిపాల్‌రెడ్డి వివరించారు.
ఇదీ చదవండి: ఇకనుంచి తహసీల్దార్లే జాయింట్ రిజిస్ట్రార్‌లు: కేసీఆర్