సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో సాగు వివరాల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఏడీఏ బిక్షపతి తెలిపారు. జహీరాబాద్ మండలం గోవిందపూర్, అల్లీపూర్ గ్రామాల్లో రైతులు పొలాల్లో సాగు చేస్తున్న పంటల వివరాల నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. గ్రామాల్లోకి వచ్చే వ్యవసాయ అధికారుల వద్దకు వెళ్లి సాగుచేస్తున్న పంటల వివరాలు నమోదు చేసుకోవాలని రైతులకు సూచించారు.
నియంత్రిత సాగు విధానంలో సూచించిన పంటలు సాగు చేసుకుని నమోదు చేసుకుంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించేందుకు వీలు ఉంటుందని అన్నారు. పంటల వివరాలు నమోదు చేసుకోని వారి నుంచి ఎలాంటి ధాన్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కేసీఆర్ సీఎంగా అనర్హుడు : ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి