సంగారెడ్డి జిల్లా మంజీరా ప్రాజెక్ట్(సింగూర్)పరిధిలోని మొసళ్ల సంరక్షణ, పునరుత్పత్తి కేంద్రంలోని మొసళ్లు చస్తూ బతుకుతున్నాయి. ఈ కేంద్రంలో దాదాపు 150 మొసళ్లు జీవిస్తున్నాయి. కాగా సహజంగా వీటిని ఐదు, ఆరు నెలల్లోనే ప్రాజెక్టు లేదా నదిలో వదిలి పెట్టాలి. వర్షాభావ పరిస్థితుల వల్ల మూడేళ్లుగా ప్రాజెక్టుకు నీళ్లు రాకపోవడం వల్ల అందులో మొసళ్లు వదలడానికి వీలు కాలేదు. దీనితో ఉత్పత్తి కేంద్రంలో వాటి సంతతి పెరిగి కొలను ఇరుకుగా మారింది. స్థలం సరిపోక నిత్యం వాటిలో అవే కొట్లాడుకుంటున్నాయి.
![crocodiles at manjeera project in sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ts-srd-31-13-crocodial-photo1-g5-ts10132_13092020121014_1309f_1599979214_37.jpg)
చిన్న వాటిపై పెద్దవి దాడి చేసి చంపి తినేస్తున్నాయి. దీనిపై అటవీశాఖ అధికారులను ఈటీవీ భారత్ ప్రశ్నించగా ఉన్నత అధికారుల ఆదేశానుసారంతో నీళ్లున్న ప్రాజెక్టులో మొసళ్లను వదులుతామని వివరించారు.
![crocodiles at manjeera project in sangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ts-srd-31-13-crocodial-photo1-g5-ts10132_13092020121014_1309f_1599979214_360.jpg)
ఇదీ చూడండి: గుండారం జలాశయ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి కలకలం