విదేశీ వస్తువులను ఆహ్వానించి, భారత రక్షణను పణంగా పెట్టడం సిగ్గుచేటని సీపీఎం పార్టీ నాయకులన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండు సమీపంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ట్రంప్ రాకను వ్యతిరేకిస్తూ... ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 'గో బ్యాక్ ట్రంప్' అంటూ నినాదాలు చేశారు. దేశీయ వస్తువులను కాదని... విదేశీ వస్తువులను ఆహ్వానించడం సరికాదన్నారు. భాజపా ప్రభుత్వం దేశ ప్రజలకు అన్యాయం చేస్తుందన్నారు.
ఇవీ చూడండి: అమెరికా అధ్యక్షుడి నోటి వెంట హైదరాబాద్ మాట