సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 27న జరగనున్న ప్రాదేశిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం అధికారులు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కంగ్టిలోని ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయా మండలాల సిబ్బంది పాల్గొన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలో తుది నిర్ణయం ఆర్వోలదేనని ఎంపీడీఓ తెలిపారు. సిబ్బంది పారదర్శకంగా లెక్కింపులో పాల్గొనాలని సూచించారు.
ఇవీ చూడండి: ఉద్రిక్తంగా మారిన విద్యాశాఖ కార్యాలయం ముట్టడి