సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పర్శపల్లిలో కరోనా కలవరం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వైరస్ బారినపడ్డారు. ఫలితంగా గ్రామస్థులు ఆందోళనకు గురవుతున్నారు.
విషయం తెలుసుకున్న వైద్యారోగ్యశాఖ అధికారులు గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టారు. ప్రధాన వీధుల్లో రసాయన ద్రావణాలను పిచికారీ చేయించారు. కేసులు నమోదైన వీధిని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.
ఇదీ చూడండి: సిరిపూర్‌లో లాక్డౌన్ విధిస్తూ పంచాయతీ పాలకవర్గం తీర్మానం