కానిస్టేబుల్ తుకారాం.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం కంగ్టి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా కట్టడిలో భాగంగా నిరంతరం పనిచేస్తున్న కంగ్టి మున్సిపల్ సిబ్బందికి సాయం చేయ్యాలని అనుకున్నారు.
అందులో భాగంగా నలుగురు కార్మికులకు కొత్త బట్టలు అందించి ఉదారత చాటుకున్నారు. దశాబ్ద కాలంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ.. నారాయణఖేడ్ డివిజన్‌లో ప్రజల మన్ననలు పొందుతున్నారు.
ఇదీ చూడండి: 'మన జీవన విధానం ద్వారానే కరోనాను అడ్డుకోవచ్చు'