సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ హత్య కేసులో కానిస్టేబుల్ ప్రకాశ్‌ను రిమాండ్కు తరలించారు. హత్నూర పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ప్రకాశ్ గత మూడేళ్లుగా మందారికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. కొన్నిరోజుల క్రితం వీరి మధ్య భూవివాదం చోటు చేసుకుంది. ఎలాగైనా ఆమెను చంపాలనుకున్న ప్రకాశ్ పథకం ప్రకారం... మందారికను హత్యచేసి పెట్రోల్ పోసి తగులబెట్టాడు. నిందితుడిని పట్టుకున్న రామచంద్రపురం పోలీసులు రిమాండ్కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : రాజ్‌భవన్ ముట్టడికి సీపీఐ యత్నం