పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. అధిష్ఠానం పిలుపు మేరకు జహీరాబాద్ ప్రభుత్వ అతిథి గృహం నుంచి బస్టాండ్ మీదుగా ప్రధాన రహదారిపై జెండాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన కొనసాగించారు. అనంతరం పట్టణంలోని పెట్రోల్ బంకుల ఎదుట మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కరోనా కష్టకాలంలో సామాన్య ప్రజలపై భారం మోపుతూ కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఇంధన ధరలు పెంచుతోందని మండిపడ్డారు. లీటరు పెట్రోల్ రూ.100 దాటిందని అన్నారు. సామాన్యులపై ధరల భారం మోపవద్దని డిమాండ్ చేశారు. చమురు ధరలను అదుపు చేసే వరకూ ఆందోళన కొనసాగిస్తామని నాయకులు ప్రకటించారు.
ఇదీ చూడండి: MURDER: చెల్లితో అసభ్య ప్రవర్తన.. రోకలిబండతో చంపిన సోదరి