సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ నాయకులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. జహీరాబాద్ మాజీ ఎంపీ సురేష్ షెట్కర్, నారాయణ్‌ఖేడ్ ఎంపీపీ సంజీవరెడ్డి... ఇంటింటికీ తిరిగి ఓట్లు వేయామని అభ్యర్థించారు.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, తెరాస నాయకులు... మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. సింగూర్ నీటిని వేరే ప్రాంతాలకు తరలించి నారాయణ్‌ఖేడ్‌లో నీటి కొరత ఏర్పడడానికి కారణమయ్యారని మండిపడ్డారు. కాంగ్రెస్ ద్వారానే ఈ పట్టణ అభివృద్ధికి అవకాశం ఉందని ఓటర్లు గమనించి హస్తం గుర్తుకు ఓటు వేసి 15 వార్డుల్లో గెలుపుకోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.
ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్.. దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'