సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఓ వ్యక్తి ఇంటి నిర్మాణ పనులకోసం నిర్మించిన కట్డడాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఆ వ్యక్తిపై కక్ష కట్టి పురపాలక సిబ్బంది ఈ తరహాలో చర్యలకు ఉపక్రమించారని పట్టణ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.
మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నల్లబ్యాడ్జీలకో హాజరై నిరసన తెలిపారు. బాధిత వ్యక్తికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.