సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లక్డారం గ్రామంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ(Referendum issue) రసాభాసగా మారింది. గ్రామ శివారులో 747 సర్వే నంబర్లో నాలుగు హెక్టార్ల ప్రాంతంలో కంకర క్రషర్ ఏర్పాటుపై కాలుష్య నియంత్రణ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. వివరాలను నమోదు చేసుకునేందుకు జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి వచ్చారు.
గ్రామస్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కలిపి మొత్తం 33 మంది అభిప్రాయాలను తెలియజేయగా... ఇందులో 18 మంది తమ అభిప్రాయాలను వినతి రూపంలో అందజేశారు. గ్రామస్థుల్లో ఎక్కువశాతం మంది ఈ కంకర క్రషర్ ఏర్పాటుతో పర్యావరణం దెబ్బతింటుందని... అంతేకాకుండా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు. దీనిని ఏర్పాటు చేయవద్దని చెప్పారు. అంతేకాకుండా ఏర్పాటుకు సానుకూలంగా అభిప్రాయాన్ని ఇచ్చేందుకు వచ్చిన వారితో వాగ్వాదానికి దిగారు. గ్రామంలోని ఇబ్బందులు తమకు తెలుసునని... ఎక్కడి నుంచో వచ్చిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి సానుకూలంగా స్పందించడం ఏంటని గ్రామస్థులు జిల్లా అదనపు కలెక్టర్‌ను ప్రశ్నించారు. అక్కడ కంకర క్రషర్ ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: Gardening plants for home: గార్డెనింగ్‌లో న్యూ ట్రెండ్.. ఈ ఆకారంలో మొక్కలు మీరెప్పుడైనా చూశారా?