సమయ పాలన పాటించని ఉపాధ్యాయులపై వేటు తప్పదని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. కంకోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బడి పరిసరాలను పరిశీలించి ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాన్ని గమనించి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. సాయంత్రం నాలుగు గంటల వరకు అందరూ పాఠశాలలోనే ఉండాలని లేనిపక్షంలో టీచర్లపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండిః విద్య హక్కు చట్టాన్ని పునఃపరిశీలించాలి: సబితా ఇంద్రారెడ్డి