ప్రతీ గ్రామం అభివృద్ధి చేందాలని అందుకనుగుణంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సంగారెడ్డి జిల్లా పాలనాధికారి హనుమంతరావు వెల్లడించారు. ప్రతీ గ్రామంలో ట్రాక్టరు, ట్రాలీ, ట్యాంకర్‌లు అందుబాటులో ఉండాలని.. వీటితోపాటు వైకుంఠథామం, డంపింగ్ యార్డ్ వంటివి ఉండాలని అప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆయన సూచించారు. జిన్నారం మండలం పరిధిలోని పర్యటించిన ఆయన డంపింగ్ యార్డు, వైకుంఠధామం, ఎరువు తయారీ విధానాన్ని పరిశీలించి.. హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు.
కొడకంచి గ్రామంలో మంచిగా ఎరువులను తయారుచేస్తున్నారని కొనియాడారు. వందశాతం అభివృద్ధి పనులు నిర్వహించిన జిన్నారం మండలం జిల్లాలోనే కాక రాష్ట్రంలో ఏకైక మండలంగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. జిల్లా అధికారుల ప్రోత్సాహం, స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి దిశానిర్దేశంతో, స్థానిక యంత్రాంగం బాగాచేశారని ప్రశంసించారు.
ఇదీ చూడండి: బాలిక అభ్యర్థనపై స్పందించిన కలెక్టర్.. స్మార్ట్‌ఫోన్ కానుక