సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్న జలాశయాల నిర్మాణ పనులను సీఎం ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ తనిఖీ చేశారు. పుల్కల్ మండలం సింగూరు జలాశయం వద్ద గల ఇంటెక్ వెల్, సంగారెడ్డి మండలం రాజంపేటలో ఉన్న మొదటి, రెండో దశ నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.
హైదరాబాద్‌కు నీటి సరఫరా కోసం పెద్దాపూర్‌లో నిర్మిస్తున్న ట్రీట్మెంట్ ప్లాంటు నమూనాను స్మితా సబర్వాల్ వీక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలనాధికారి హనుమంతరావు, ఈడీ సత్యనారాయణ, డీటీ రవికుమార్, జీఎం రామకృష్ణ, నీటిపారుదలశాఖ సీఈ మధుసూదన్‌రావు, ఈఈ మధుసూదన్‌రెడ్డి, మిషన్ భగీరథ ఈఈ కృపాకర్‌రెడ్డి, సీఈ చక్రవర్తి, ఎస్ఈ రఘువీర పాల్గొన్నారు.