ETV Bharat / state

చిన్నారులతో పొలం బాట పట్టిన నగరవాసులు

అన్నం ఎక్కడి నుంచి వస్తుంది. ప్యాకెటులోకి పాలు ఎలా వస్తాయి అన్న విచిత్ర సందేహాలు ప్రస్తుత తరం చిన్నారుల నుంచి వింటుంటాం. కాంక్రీట్ జంగిల్ లాంటి నగరాల్లో యాంత్రికంగా మారిన జీవన విధానంలో వ్యవసాయం.. పంటల గురించి తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది. ఎప్పుడైనా కాస్తా సమయం దొరికితే ఫోన్లు.. గ్యాడ్జెట్లు.. వీటితో విసిగిపోయిన కొంతమంది భాగ్యనగర వాసులు తమ చిన్నారులతో పొలాలను వెతుక్కుంటూ పల్లె బాట పట్టారు.

field visit
author img

By

Published : Aug 19, 2019, 7:40 PM IST

Updated : Aug 19, 2019, 11:10 PM IST

ఆధునిక జీవనవిధానంలో పట్టణాల్లో పెరగుతున్న చిన్నారుల్లో చాలా మందికి వ్యవసాయంపై కనీస అవగాహన లేదు. తాము తినే ఆహారం ఎలా వస్తుంది.. ఎక్కడి నుంచి వస్తుంది అన్న కనీస అంశాలు కూడా తెలియకుండా పెరుగుతున్నారు. నిత్యం ఉరుకుల పరుగుల జీవితం.. పని ఒత్తిళ్లలో పట్టణాల్లోని పెద్దలూ పొలాల్లో అడుగు పెట్టి ఏళ్లు గడుస్తోంది. కొంత మంది తమ జ్ఞాపకాలను నెమరు వేసుకోవడానికి.. పిల్లలకు వ్యవసాయం అంటే ఎంటో చూపించడానికి పొలం బాట పట్టారు. సంగారెడ్డి జిల్లా మాచనూర్ గ్రామంలో ఉన్న పొలాలకు వచ్చారు.

ఎడ్ల బండి ఎక్కి సందడి చేశారు

చిన్నా.. పెద్ద అన్న తేడా లేకుండా పొలాల్లో కలియ తిరిగారు. వివిధ రకాల పంటల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. వారితో కలిసి పొలాల్లో కొంత సేపు పని చేశారు. ఎడ్ల బండి ఎక్కి సందడి చేశారు. పచ్చటి పైర్లతో ఉన్న ప్రకృతిని చూసి పులకరించిపోయారు.

వారి కష్టం ఎంటో తెలుస్తుంది

పొలాల వద్దకు రావడం వల్ల.. పంటలు ఎలా పండుతాయో తెలుసుకోవడంతో పాటు.. వాటిని పండించడానికి రైతులు ఎంత కష్టపడుతున్నారో చిన్నారులు తెలుసుకునే అవకాశం ఉందని వారి తల్లిదండ్రులు అంటున్నారు. రైతులపై గౌరవం పెరగడంతో పాటు.. వ్యవసాయం కూడా ఒక వృత్తి అని చిన్నారులు తెలుసుకుంటారని.. వారు కూడా ఆ రంగంలో స్థిరపడే అవకాశాలు ఉంటాయని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పొలాల మధ్య గడిపి తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నామని పెద్దలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు వ్వవసాయంపై కనీస అవగాహన కల్పించడంతో పాటు.. అప్పుడప్పుడు పొలాలకు తీసుకెళ్తే.. అన్నదాతల కష్టాలు తెలుసుకుంటారు.

ఇదీ చూడండి: కర్ణాటక ఎత్తుగడలు ఇక్కడ నడవవు: కేటీఆర్

sample description
Last Updated : Aug 19, 2019, 11:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.