కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందు సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మికులను ఆదుకోవాల్సిన సమయంలో వారిని ఇబ్బందులకు గురిచేసే చర్యలు సరికాదని సీఐటీయూ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను నాశనం చేస్తూ.. వారి హక్కులను కాలరాస్తున్నారని అన్నారు.
లాక్డౌన్ సమయంలో కార్మికులకు వేతనాలు ఇవ్వని యాజమాన్యాలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పనిగంటలు పెంచి కార్మికులను కష్టపెట్టే చర్యలు మానుకోవాలని హితవు పలికారు. కార్మికులకు అన్యాయం జరిగితే ప్రత్యేక కార్యాచరణ రూపొందించి కార్మికోద్యమం చేపడుతామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: పెళ్లికొచ్చిన బంధువులు నెల రోజులుగా టెంట్ల కిందే!