ETV Bharat / state

పటాన్​చెరు మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు - sangareddy district latest news

పటాన్​చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్​గౌడ్​ కుమారుడు ఆశిష్​ గౌడ్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డిపై అనుచిత పోస్టింగ్​లపై వచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నారు.

Case registered against Patan Cheru former MLA's son asish goud
పటాన్​చెరు మాజీ ఎమ్మెల్యే కుమారుడిపై కేసు నమోదు
author img

By

Published : Nov 3, 2020, 11:01 PM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు, బీజేవైఎం నాయకులు ఆశిష్​ గౌడ్​పై కేసు నమోదైంది. నాలుగు సెక్షన్ల కింద పటాన్​చెరు పోలీసులు కేసు నమోదు చేశారు.

అసలేమైందంటే..

వరద బాధితులకు వచ్చిన పరిహారాన్ని పటాన్​చెరు ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి, ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి కాజేస్తున్నారంటూ ఆశిష్​ గౌడ్​ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేసి.. వారి పరువుకు భంగం కలిగించారంటూ తెరాస నాయకులు విజయ్ కుమార్ పటాన్​చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆశిష్​రెడ్డిపై 500, 501, వరద బాధితుల విషయంలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని 505(2), రెండు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొల్పేలా చేశారని 153ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇదీ చూడండి:ఈనెల 13 తర్వాత ఎప్పుడైనా జీహెచ్​ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్​ : ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.