సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం సుల్తాన్ పూర్ వద్ద కారుతో సహా ఓ వ్యక్తి సజీహ దహనమయ్యాడు. బాహ్యవలయ రహదారిలో మేడ్చల్ నుంచి ముత్తంగి వైపు వెళుతున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు దావానంలా మారటంతో వాహనంలో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు.
మృతుడు పురుషుడా స్త్రీనా అనేది ఇంకా తెలియరాలేదు. దగ్ధమైన కారు మియాపూర్ జేపీనగర్కు చెందిన శ్రీదేవి అనే మహిళ పేరిట ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండీ:'కేసులకు భయపడను'