సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గారిడేగామ శివారులో ఓ వ్యక్తి పత్తిలో అంతర పంటగా గంజాయి మొక్కలు సాగు చేస్తున్నాడు. సమాచారం అందుకున్న నారాయణఖేడ్ ఎక్సైజ్ పోలీసులు సీఐ మహేశ్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. 320 గంజాయి మొక్కలను గుర్తించి ధ్వంసం చేశారు. సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.
ఇవీచూడండి: కరెంట్ షాక్ తగిలి కలకత్తా యువకుడు మృతి