సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లీ మండలం జాడి మల్కాపూర్‌లో రైతు బల్లెపు రాచన్నకు చెందిన ఎద్దు బుధవారం రాత్రి మృతి చెందింది. వ్యవసాయ సాగు పనుల్లో కన్నబిడ్డలా సేవలందించిన ఎద్దు మృతితో కుటుంబ సభ్యులు రాత్రంతా కన్నీరుమున్నీరుగా విలపించారు. మనుషులకు నిర్వహించే అంత్యక్రియలకు ఏమాత్రం తీసిపోని విధంగా డప్పుల ఊరేగింపుతో అంతిమయాత్ర నిర్వహించారు. సుమారు పాతిక వేలు ఖర్చుపెట్టి ఎద్దుకు అశ్రునయనాల మధ్య వీడ్కోలు పలికారు.
ఇవీచూడండి: ప్రభాకరరావు పచ్చి అబద్దాల కోరు: ఎంపీ రేవంత్ రెడ్డి