సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇంద్రేశం గ్రామ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న బహుళ అంతస్తు భవనాలను కలెక్టర్ ఆదేశాల మేరకు పాక్షికంగా కూల్చివేశారు. పంచాయతీ అధికారులు ముందుగానే గుర్తిస్తే కూల్చాల్సిన అవసరం ఉండదంటూ హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. తొలిదశలోనే ఎందుకు గుర్తించలేకపోయారని, చూసీచూడనట్లు వ్యవహరించడంతోనే ఈ నిర్మాణాలు వెలిశాయని పంచాయతీ అధికారులపై హెచ్ఎండీఏ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలను పాక్షికంగా కూల్చివేయడం జరుగుతుందని తెలిపారు.
ఇదీ చూడండి: 'రద్దయిన పాత నోట్లను మార్చే ముఠా పట్టివేత'