ETV Bharat / state

'రిజిస్ట్రేషన్​ చేయించుకోకపోతే... కాలం చెల్లిపోతుంది' - బీఎస్ 4 వాహనాల రిజిస్ట్రేషన్లు

కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా కొంతమంది తాత్కాలిక నెంబర్​తోనే తిరిగేస్తూ ఉంటారు. అలాంటి వారికి సర్వోన్నత న్యాయస్థానం మార్చి 31 వరకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని గడువు విధించింది. వాయు కాలుష్యం నేపథ్యంలో ఇప్పటికే వాహనాల కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వాహనదారులు తమ వాహనాలతో రవాణాశాఖ కార్యాలయాల బాటపడుతున్నారు.

BS4 vehicles registration last date at march 31
'రిజిస్ట్రేషన్​ చేయించుకోకపోతే... కాలం చెల్లిపోతుంది'
author img

By

Published : Mar 12, 2020, 10:50 AM IST

బీఎస్‌-4 ఇంజన్‌ ఉన్న వాహనాల రిజిస్ట్రేషన్లు ఈ నెల 31వ తేదీతో ముగియనున్నాయి. వాహనాల వల్ల వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు సుప్రీంకోర్టు మోటారు వాహనాల కంపెనీలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. భారత్ స్టేజ్ ఫోర్ పరిగణనలోకి వచ్చే వాహనాలు సంగారెడ్డి జిల్లాలో 7,261 ఉన్నాయి. వీటిలో కొన్ని వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాయి.

మిగిలిన వారు తాత్కాలిక నెంబర్​తోనే కాలం గడిపేస్తున్నారు. తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మార్చి 31వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు వాహనదారులు వేగం పెంచుతున్నారు. రవాణాశాఖ కార్యాలయాలకు క్యూ కడుతున్నారు.

'రిజిస్ట్రేషన్​ చేయించుకోకపోతే... కాలం చెల్లిపోతుంది'

గతంలో స్లాట్ బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి వచ్చేది. ప్రస్తుతం స్లాట్ లేకుండానే నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. కార్యాలయాల పని వేళలు కూడా పెంచింది. బీఎస్ 4 వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో బ్యానర్లు, గ్రామాల్లో దండోరా, ప్రచార వాహనాల ద్వారా ప్రచారం వంటి కార్యక్రమాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

ఇవీ చూడండి: పలువురు ఐఏఎస్​లకు అదనపు బాధ్యతలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.