హంగూ ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేసుకోవడమే కాకుండా... వివాహానికి అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించిన వరుడిని కేటీఆర్ అభినందించారు. సంగారెడ్డి జిల్లా కంగ్టికి చెందిన సంతోష్ కుమార్ అనే యువకుడి నిర్ణయాన్ని ఈనాడులో ప్రచురించింది. ఆ యువకుడిని అభినందిస్తూ కేటీఆర్ పేపర్ క్లిప్‌ను ట్విట్టర్లో పంచుకున్నారు.
కంగ్టికి చెందిన సంతోష్ కుమార్ వ్యవసాయ విస్తరణ అధికారిగా పనిచేస్తున్నాడు. ఈ నెల 26న పెళ్లి చేసుకునేందుకు ముహూర్తం నిశ్చయించారు. లాక్డౌన్ కారణంగా ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా పెళ్లి చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. వివాహానికయ్యే ఖర్చు రూ.2లక్షల చెక్కును మంత్రి హరీశ్ రావుకు అందించారు.
ఇవీచూడండి: దేశంలోనే మొట్టమొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ప్రారంభం