సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో స్ర్రీ, శిశు, వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లూయిస్ బ్రెయిలీ 211వ జయంతి వేడుకలు జరిపారు. బ్రెయిలీ చేసిన కృషితోనే ఈరోజు ఎంతో మందికి ఉపాధి దొరికిందని జిల్లా అధికారి పద్మావతి అన్నారు. ప్రస్తుతం వారు వివిధ రంగాల్లో అత్యున్నత స్థాయిలో ఉన్నట్లు తెలిపారు.
బ్రెయిలీ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ముందుకు సాగాలన్నారు. వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వికలాంగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇదీ చూడండి : ఓటరు లిస్టులో ఐరన్ సత్యనారాయణ, డోంట్ చేంజ్ బాపు