లాక్డౌన్ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లాలో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నారాయణఖేడ్ నియోజవర్గం సరిహద్దుల్లో రహదారులను పోలీసులు మూసివేశారు. నారాయణఖేడ్ ప్రాంతం కర్ణాటక సరిహద్దుల్లో ఉండటం వల్ల అక్కడి నుంచి జనసంచారం అధికంగా ఉంటుంది. అక్కడక్కడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. పలు రహదారుల్లో గోతులు తవ్వి రాకపోకల కట్టడికి చర్యలు చేపట్టారు. కంగ్టి, మనురు, నాగల్గిద్ద మండలంలోని సరిహద్దు మార్గాల్ని మూసివేశారు. పర్యవేక్షణకు సీఐ హోదా అధికారులను నియమించారు.
సంగారెడ్డి జిల్లాలో రాకపోకల కట్టడికి కఠిన చర్యలు - సంగారెడ్డిలో లాక్డౌన్
లాక్డౌన్ను పూర్తి స్థాయిలో అమలుచేసేందుకు సంగారెడ్డి జిల్లాలో కఠిన చర్యలు చేపట్టారు. నారాయణఖేడ్ నియోజకవర్గం సరిహద్దులను మూసివేశారు.