సంగారెడ్డి జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్వామి సేవా సమితి సంస్థ ప్రారంభించి ఒక నెల పూర్తి అయినందున నేడు సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయవాది పాపిరెడ్డి హాజరయ్యారు. అనంతరం రక్త దాన శిబిరంలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు. కరోనా విపత్కర సమయంలో రక్తం దొరకక ఎందరో ప్రాణాలు కోల్పోయారని అన్నారు. ఇలాంటి సమయంలో ఈ కార్యక్రమలు చేపట్టడం పట్ల సంస్థ నిర్వహుకులను ఆయన అభినందించారు.
సంస్థ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం సంతోషంగా ఉందని.. ఇలానే ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాజర్షి షా, డీఎస్పీ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: తగ్గిన బంగారం ధర- రూ. 48 వేల దిగువకు