ETV Bharat / state

MLA Etela Rajender: 'ఒక్క ఎకరా అక్రమమని తేలినా… ముక్కు నేలకు రాస్తా' - ఈటల రాజేందర్ వార్తలు

Etela Rajender on Land Grabbing: అచ్చంపేట భూముల్లో ఈటల కుటుంబం కబ్జా చేసిందని మెదక్ జిల్లా కలెక్టర్ చెప్తుంటే.. అచ్చంపేట భూముల్లో ఒక్క ఎకరా అక్రమమని తేలినా… ముక్కు నేలకు రాస్తామని ఈటల రాజేందర్ చెప్తున్నారు. ఇప్పటికీ ఈ విషయమై ఇంకా క్లారిటీ రాలేదు.

Etela Rajender on Land Grabbing, mla etela rajendar
భూ కబ్జాపై ఈటల రాజేందర్ వ్యాఖ్యలు
author img

By

Published : Dec 7, 2021, 10:30 AM IST

Updated : Dec 7, 2021, 12:29 PM IST

MLA Etela Rajender: 'ఒక్క ఎకరా అక్రమమని తేలినా… ముక్కు నేలకు రాస్తా'

Etela Rajender on Land Grabbing: మెదక్ జిల్లా అచ్చంపేట భూముల్లో ఒక్క ఎకరా అక్రమం అని తేలినా… ముక్కు నేలకు రాస్తామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. సంగారెడ్డిలో నిర్వహించిన భాజపా జిల్లా శిక్షణ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే, మంత్రి స్థాయిలో ఉన్న తాను భూముల కోసం బెదిరిస్తే... ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ భూముల కోసం ఏ స్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డారని ఈటల ప్రశ్నించారు.

రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్న వ్యక్తి కేసీఆర్. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు మీరు కూడా హుజూరాబాద్​లో ఏమి జరిగిందో గుర్తు చేసుకోండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు కూడా అంతరాత్మ సాక్షిగా ఓట్లు వేయండి. ఐఏఎస్​లు, ఐపీఎస్​లు ప్రజలకు కట్టుబడి ఉండాలి. కర్తవ్యాన్ని మరిచిపోయి ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను పాటిస్తే.. వారి గతి ఏమవుతుందో మనం గతంలోనే చూశాం.

ఒక్క ఎకరం కబ్జా చేసినా అని నిరూపిస్తే ముక్కు నేల రాస్తాను. ఒకవేళ ఉంటే తీసుకోమనే చెప్తాను. నేనే భూ కబ్జా చేస్తే.. మరి కేసీఆర్ ఎంత భూ కబ్జా చేసి ఉండాలి? ఒక శాసన సభ్యుడికి, మంత్రికి బెదిరించే అధికారముంటే.. మరి ముఖ్యమంత్రికి ఎంత ఉండాలి? నువ్వెన్ని చేసి ఉండాలి మరి. నాదేమో తొండలు కూడా గుడ్లు పెట్టని భూమి. అలాంటి భూమిని కబ్జా చేసేందుకు బెదిరించిన అని ఆరోపణలు ఎందుకు? కొండాపూర్​లో అసైన్డ్ భూములను ఏమి చేశారు మరి..

-ఈటల రాజేందర్, భాజపా ఎమ్మెల్యే

రాష్ట్రంలో కేసీఆర్ తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని... పార్టీ ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. ఇతరపార్టీల ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గొంతు ఎత్తేవారు లేకుండా చేశారని అన్నారు. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు... ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతరాత్మ సాక్షిగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

ఈటల కుటుంబం కబ్జా చేసింది నిజమే: మెదక్ కలెక్టర్

Medak Collector Harish Latest Press Meet : మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కుటుంబీకులకు చెందిన జమునా హేచరీస్‌ ఆక్రమణలో 70.33 ఎకరాల ఎసైన్డు, సీలింగ్‌ భూములున్నట్లు మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ వెల్లడించారు. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట గ్రామాల్లో పేదలకు కేటాయించిన ఈ భూములను కబ్జా చేశారని నిర్ధారించారు. దీంతో పాటు వివిధ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తెలిపారు. క్రిమినల్‌, సివిల్‌ చర్యలకు సిఫార్సు చేస్తూ సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.

Last Updated : Dec 7, 2021, 12:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.