కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుపై ప్రతిపక్షాల ఆరోపణలను ఖండిస్తున్నామని సంగారెడ్డి భాజపా కార్యాలయంలో భాజపా మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ తెలిపారు. రైతులకు మంచి చేయడానికే ప్రధాని మోదీ వ్యవసాయ బిల్లును ప్రవేశపెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
రైతు బిల్లుపై ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాల మాటల్లో నిజాయతీ లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు దళారుల బాధ ఉండదన్నారు. రైతులకు లాభాలు వచ్చి ఆనందంగా ఉండాలనేదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని నారాయణ చెప్పారు.
ఇదీ చదవండిః ఎల్ఆర్ఎస్ వల్ల రాష్ట్ర ప్రజలపై అధిక భారం : భట్టి