రాష్ట్ర ప్రభుత్వం.. కరోనాను కట్టడి చేద్దాం అనే మాటలే కానీ చేతల్లో చూపడం లేదని భాజపా నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి మండిపడ్డారు. సంగారెడ్డిలోని ఓ హాల్లో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి విజయాలపై సమావేశం నిర్వహించారు. కష్ట కాలంలో రాజకీయాలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని చేస్తేనే కరోనా మహమ్మరిని ఎదుర్కోగలమని అన్నారు.
పక్క రాష్ట్రంలో కరోనాని ఆరోగ్యశ్రీ లో చేర్చారు కానీ మన రాష్ట్రంలో చేర్చకుండా సాకులు చెప్పడం సబబు కాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కరోనాని తరిమి కొట్టే ప్రయత్నాలు చేయాలని, వైరస్ సోకిన వారికి మంచి వైద్యం అందించాలని భాజపా నాయకులు డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: షాపింగ్ సెంటర్లో భారీ అగ్ని ప్రమాదం