సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఇప్పటికే తెదేపా నాయకులు చాలామంది వేరే పార్టీల గూటికి చేరుతుండగా ప్రస్తుతం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీకాంత్ గౌడ్ కూడా భాజపా గూటికి చేరనున్నారు. ఈనెల 18న జేపీ నడ్డా సమక్షంలో ఆయన భాజపా కండువా కప్పుకోనున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి, పదవికి రాజీనామా చేస్తున్నట్టు లేఖను ఫ్యాక్స్‌లో పంపానని తెలిపారు. తెరాసకు ప్రత్యామ్నాయంగా ఉండే శక్తి, కేసీఆర్ నిరంకుశ పాలనకు చమరగీతం పాడడం భాజపాకే సాధ్యం అవుతుందన్నారు.
ఇదీ చూడండి: పటాన్‌చెరులోని రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం