జల్సాలకు అలవాటు పడి గత సంవత్సర కాలంగా ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న ఇద్దరు దొంగలను సంగారెడ్డి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. ఆందోల్ మండలానికి చెందిన రాము, మల్లికార్జున్లను పోలీసులు అరెస్టు చేశారు. అమాయకులను ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. సంగారెడ్డి స్టేషన్ పరిధిలో 18, రూరల్ పరిధిలో 1, కూకట్ పల్లి పరిధిలో ఒక ద్విచక్రవాహనం దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. ఇరువురికి గతంలో ఎలాంటి నేరారోపణలు లేవని.. త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ఫ్యాన్సీ నంబర్లంటూ మోసం...