రాష్ట్రంలో రైతులు పడుతున్న కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనబడటం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. వారి సమస్యలు తెలుసుకునేందుకే పొలంబాట పట్టినట్లు తెలిపారు. సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మనురు మండలం రాయిపల్లిలో భట్టి పర్యటించారు. టమాటో, ఆలు గడ్డ రైతులను కలిసి... వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
కేసీఆర్ ఫామ్‌హౌస్ రాజకీయాలకే పరిమితమని... ఆయనకు రైతుల సమస్యలు తెలియవని భట్టి వ్యాఖ్యానించారు. తెరాస ప్రజాప్రతినిధులకు రైతులను కలవడం ఎందుకు కుదరడంలేదంటూ ప్రశ్నించారు. రైతులకు రావాల్సిన రాయితీ రావడంలేదని ఆరోపించారు. రైతులను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఎద్దేవా చేశారు. సింగూరు ప్రాజెక్టులో నీటిని తరలించి... ఇక్కడి రైతుల పొట్టకొడుతున్నారంటూ మండిపడ్డారు. దిక్కులేని రైతుల కన్నీళ్లు తుడిచేది కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు.
ఇదీ చూడండి: అమ్మాయి పుట్టింది.. అమ్మ గెలిచింది..!