సంగారెడ్డి జిల్లా బీరంగూడ గుట్టపై శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో మహా శివరాత్రి పురస్కరించుకుని అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించారు. స్వామివారిని అలంకరించి భక్తులకు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఆలయ మండపంలో సామూహిక అభిషేకాలు చేశారు.
పెరుగుతున్న భక్తుల దృష్ట్యా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. స్వామిని దర్శించుకునేందుకు శివస్వాములు, భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
ఇదీ చూడండి : బ్రహ్మ, విష్ణువు తగువు తీర్చిన రోజు!