సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం ఆవరణలో వెన్నముద్దల బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రకరకాల పూలతో బతుకమ్మలను పేర్చి, ఆడిపాడారు. వేడుకల్లో జడ్పీ ఛైర్పర్సన్ మంజుశ్రీ, స్థానిక కలెక్టర్ హన్మంతరావు దంపతులు, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. బతుకమ్మ పాటలతో కలెక్టరేట్ ప్రాంగణమంతా మారుమోగింది.
ఇవీ చూడండి:'సాయంత్రం 6 వరకు విధుల్లో చేరకుంటే ఉద్యోగులు కారు'