బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకులను సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. తెరాస, కాంగ్రెస్, భాజపా, ఇతర ప్రజా సంఘాల నాయకుల ఆధ్వరంలో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి... నివాళులు అర్పించారు. అతి చిన్న వయసులో పార్లమెంటులో అడుగు పెట్టిన ఘనత వారికి దక్కిందని పేర్కొన్నారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్ తర్వాత కులవివక్షపై పోరాడిన గొప్ప నాయకుడు జగ్జీవన్ రామ్ అని కీర్తించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని వక్తలు సూచించారు.
ఇదీ చదవండి: ఉపాధి కూలీల వినియోగానికి ఆ శాఖల విముఖత