సంగారెడ్డి, సదాశివపేట మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తామని... రాష్ట్ర బెవరేజెస్ సంస్థ ఛైర్మన్, తెరాస ఎన్నికల ఇన్ఛార్జి దేవీప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. సదాశివపేటలో తెరాస అభ్యర్థులకు బీ-ఫామ్లు అందజేశారు. గత ఐదేళ్ల అభివృద్ధి చూసి ఓటేయాలని కోరారు. ప్రతిపక్షాల మాయమాటలకు మోసపోవద్దని మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూచించారు. టికెట్ రాని వారు ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని... తర్వాత ఇతర పదవులు ఇచ్చి గౌరవిస్తామని హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: