సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్న ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని పటాన్చెరు డీఎస్పీ రాజేశ్వరరావు అన్నారు. నూతన ట్రాఫిక్ నియమాలు అమల్లోకి రానున్న తరుణంలో పటాన్చెరు మండలం ఇస్నాపూర్ కూడలిలో ట్రాఫిక్ అధికారుల ఆధ్వర్యంలో వాహన చోదకులకు, ఆటోడ్రైవర్లకు అవగాహన కల్పించారు. ప్రజల క్షేమం కోసమే కేంద్ర ప్రభుత్వం భారీ జరిమాన విధానాన్ని తెచ్చిందన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే నగదు సమయం కాదని, ప్రయాణం కూడా భద్రంగా ఉంటుందని సూచించారు.
'ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ వడ్డన తప్పదు' - dsp
ప్రజలకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించేందుకే కేంద్ర ప్రభుత్వం నూతన ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి తెచ్చిందని పటాన్చెరు డీఎస్పీ రాజేశ్వరరావు అన్నారు. సెప్టెంబరు ఒకటి నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వస్తున్న తరుణంలో వాహన చోదకులకు అవగాహన కల్పించారు.