ETV Bharat / state

'పుట్టుకతో ఎవరూ... నేరస్థులు కారు'

పిల్లలు ఎదుగుతున్నప్పుడే వారికి సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని ఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తి జస్టిస్​ సాయి రమాదేవి అన్నారు.

awareness on Child Protection Act in sangareddy
సంగారెడ్డిలో బాలల సంరక్షణ చట్టంపై అవగాహన
author img

By

Published : Dec 20, 2019, 1:04 PM IST

సంగారెడ్డిలో బాలల సంరక్షణ చట్టంపై అవగాహన

పోలీసులు, అధికారులకు బాలల సంరక్షణ చట్టంపై అవగాహన కల్పించడానికి సంగారెడ్డి జిల్లా కోర్టులో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉమ్మడి మెదక్​ జిల్లా న్యాయమూర్తి జస్టిస్​ రమాదేవి హాజరయ్యారు.

దేశంలో నిర్భయ, దిశ, సమత లాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని జస్టిస్​ సాయి రమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టుకతో ఎవరూ నేరస్థులు కారని.. చుట్టూ జరుగుతున్న పరిస్థితులే అలా మారుస్తాయని తెలిపారు.

పోలీసులు, అధికారులు తమ పరిధిలో ఉన్న బాలలకు.. చట్టాలపై, సామాజిక అంశాలపై అవగాహన కల్పించి.. చెడు దారుల్లోకి వెళ్లకుండా కాపాడాలని సూచించారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.