ETV Bharat / state

ఘనంగా భాజపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు - Ambedkar Jayanti celebrations

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. పార్టీ జెండా ఎగురేసి మిఠాయిలు పంచుకున్నారు.

BJP Emergence Day celebrations
భాజపా ఆవిర్భావ దినోత్సవం
author img

By

Published : Apr 6, 2021, 1:15 PM IST

డా. బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని.. ప్రతీ బూత్​లో నేటి నుంచి 14 వరకు వేడుకలను నిర్వహించనున్నట్లు సంగారెడ్డి జిల్లా భాజపా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని భాజపా కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవాల్లో నరేందర్​రెడ్డి పాల్గొన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. లాక్​డౌన్​లోనూ.. అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు అండగా నిలిచారని గుర్తుచేశారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రతీ గడపకు వెళ్లి వివరిస్తామని నరేందర్ తెలిపారు. కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలను జరుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'కరోనా సోకిందని కుటుంబంతో సహా వెలివేశారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.