ETV Bharat / state

సంగారెడ్డిలో అంబేడ్కర్‌ జయంతి... అన్నదానం - Sangareddy Ambedkar Jayanthi

లాక్‌డౌన్‌ దృష్ట్యా తక్కువ మందితో సంగారెడ్డిలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు జరుపుకున్నారు. పట్టణంలోని కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్‌ సాయి రమాదేవి... అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాటసారులకు అన్నదానం చేశారు.

సంగారెడ్డిలో అంబేడ్కర్‌ జయంతి... అన్నదానం

author img

By

Published : Apr 14, 2020, 3:50 PM IST

సంగారెడ్డిలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 129వ జయంతి వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. పట్టణంలోని కోర్టు ఆవరణలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్‌పర్సన్ సాయి రమాదేవి... అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం హైదరాబాద్‌ నుంచి సొంత గ్రామాలకు కాలినడకన వెళ్తున్న వారికి అన్నదానం చేశారు. వారిని ప్రత్యేక వాహనంలో గ్రామాలకు పంపించారు. 18 రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని లాక్‌డౌన్ పొడిగించిన తరుణంలో ఈ నెల 30 వరకు కొనసాగిస్తామని ఆమె చెప్పారు. 30 మంది కోర్టు సిబ్బందికి నిత్యావసరాలను అందజేశారు.

ఇవీచూడండి: నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.1500

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.