సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం రుద్రారంలో ప్రమాదవశాత్తు కాలుజారి ఓ భవన నిర్మాణ కార్మికుడు మరణించారు. ఐదో అంతస్తు నుంచి కింద పడడంతో తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతిచెందినట్లు కార్మికులు తెలిపారు. గీతం విశ్వవిద్యాలయంలో జరుగుతున్న భవన నిర్మాణ పనుల్లో మెదక్ జిల్లా రేగోడుకు చెందిన అశోక్, అతని భార్య పోచమ్మ పనిచేస్తున్నారు.
ప్రమాదం జరిగిందిలా:
కార్మికులంతా నాలుగో అంతస్తు నుంచి ఏడో అంతస్తుకు సిమెంట్ ఇటుకలు తీసుకెళ్తున్నారు. తిరిగివస్తుండగా ఐదో అంతస్తు నుంచి కాలుజారి కిందపడడంతో తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.