సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం జోగిపేట పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద ఓ ఇంటి నిర్మాణం కోసం తీసిన గుంతలో ప్రమాదవశాత్తు పడి 42ఏళ్ల ముత్తు మృతి చెందాడు.
నిన్న రాత్రి ఇంటి నిర్మాణం కోసం తీసిన గుంత పక్కనే గల మరో ఇంటి ముందు ముత్తు నిద్రించాడు. ఉదయం నిర్మాణ పనుల కోసం వచ్చిన కూలీలు చూసేసరికి గుంతలో శవమై ఉన్నాడు. వెంటనే కూలీలు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి: ఆ ఆలోచన.. ఆదా చేసే.. ఆదాయం మిగిల్చే...