ETV Bharat / state

కానిస్టేబుళ్ల పదోన్నతులపై నిర్లక్షం తగదు: ఆమ్ ఆద్మీ - సిద్ధిపేట జిల్లా తాజా వార్తలు

పోలీసు ఉన్నతాధికారులు కానిస్టేబుళ్లను చిన్న చూపు చూడటం మానుకోవలని ఆమ్​ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్​ బూర రాముగౌడ్​ అన్నారు. పోలీస్​ కానిస్టేబుళ్ల పదోన్నతుల విషయంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట మౌనదీక్ష చేపట్టారు.

aam aadmi telangana convener demond to telangana government for constable promotions
కానిస్టేబుళ్ల పదోన్నతులపై నిర్లక్షం తగదు: రాము గౌడ్​
author img

By

Published : Jan 10, 2021, 7:33 PM IST

ప్రతి కార్యక్రమంలో కానిస్టేబుళ్లు ఉన్నతమైన పాత్ర వహిస్తారని ఆమ్​ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్​ బూర రాము గౌడ్​ అన్నారు. పోలీసు మాన్యువల్​ ప్రకారం అర్హులైన కానిస్టేబుళ్లకు ప్రభుత్వం వెంటనే పదోన్నతులు కల్పించాలని డిమాండ్​ చేశారు. పదోన్నతుల విషయంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్​ ఎదుట మౌనదీక్ష చేపట్టారు.

హైకోర్టు ఆదేశానుసారం పాత పోలీసు సంఘాన్ని రద్దు చేసి న్యాయ పరమైన హక్కులను పొందే స్వేచ్ఛ కొత్త పోలీసు సంఘానికి కల్పించాలని అన్నారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆమ్​ఆద్మీ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బోర్గీ సంజీవ్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: వైభవంగా గాయని సునీత వివాహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.